Random Video

రేవంత్ వచ్చాక.. కొండా దంపతులపై కాంగ్రెస్ మైండ్ గేమ్ | Oneindia Telugu

2017-11-04 613 Dailymotion

On Friday speculations are widely spreaded over Konda couple party jumping rumours, But they condemned that
ప్రత్యర్థిని ఢీకొనే సమవుజ్జీ లేనప్పుడు పార్టీలన్ని ఏకమైనా ప్రయోజనం ఆశించినంతగా ఉండదు. తెలంగాణలో కేసీఆర్, ప్రతిపక్షాల విషయంలో ఇదే జరుగుతూ వస్తోంది. కేసీఆర్ స్థాయికి తగ్గ రాజకీయ ప్రత్యర్థి ఇప్పటికీ కనుచూపు మేరలో కనిపించడం లేదు.కానీ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్‌కు బాహుబలి దొరికాడన్న ప్రచారమూ ఉంది. అయితే రేవంత్ నోరుతోనే కాంగ్రెస్ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుందని చెప్పడానికీ లేదు. రాజకీయ చతురతలో కేసీఆర్ కాకలు తీరిపోయి ఉంటే.. రేవంత్ ఇంకా అందులో పాఠాలే మొదలుపెట్టనట్టు కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభావమో.. లేక కాంగ్రెస్ ఉత్సాహమో గానీ మొత్తానికి చాలారోజుల తర్వాత ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడల వైపు పయనిస్తోంది. కొండా దంపతుల పార్టీ మార్పు అంశాన్ని కూడా ఇందులో భాగంగానే అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
కొండా దంపతుల పార్టీ మార్పు ప్రచారం పక్కా కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ అన్న విషయం స్పష్టమవుతోంది. రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ అయితే పునర్జన్మనిచ్చింది కేసీఆర్ అని కొండా దంపతులు చెబుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే రాజకీయాల్లో రాత్రికి రాత్రే కండువాలు మార్చిన చరిత్రలు చాలానే ఉన్నాయి కాబట్టి నేతలు ఇవాళ మాట్లాడిన మాటపై రేపు నిలబడుతారన్న గ్యారంటీ కూడా లేదు. ఆ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ కొండా దంపతులకు గాలం వేస్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు.